Breaking News :

కెసిఆర్ Vs మోడీ: మీ నిర్ణయం సరైనది కాదు

‘దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనో ఉందో లేదో తెలియదు. అందరికీ పరీక్షలు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు’ అని కేసీఆర్ సూచించారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం (మే 11) మధ్యాహ్నం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించారు. దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదు. ఈ విధంగా ప్రజల్ని నడిపించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలి. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Read Previous

హైదరాబాద్ మెట్రోకు గ్రీన్ సిగ్నల్?

Read Next

దారుణం.. అక్కడి వస్తువులు ఏవి తినకూడదు.. చెర్నోబిల్ ని తలపిస్తున్న వైజాగ్ గ్యాస్ లీక్