విదేశాల నుంచి వచ్చే వారికి దండం పెట్టి చెబుతున్నా:కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కోరారు.శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి దండం పెట్టి చెప్పుతున్నా.. స్వచ్చందంగా సహకరించండి. మీరు మన రాష్ట్రం వారే.. మన రాష్ట్ర బిడ్డలే.. మీకు ఒకరు చెప్పాలే అని కాకుండా మీరంతట మీరే స్వచ్చందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోండి. సమాజహితం కోరి సహకరించాడని కేసీఆర్ విజ్ఞప్తిని తెలియజేశారు.

Read Previous

మహారాష్ట్ర సరిహద్దు బంద్: కేసీఆర్

Read Next

ఏపీ కరోనా అప్ డేట్స్: వాలంటీర్లతో ఇంటింటి సర్వే భేష్