Breaking News :

కెసిఆర్ ప్రెస్ మీట్: ఇంతకీ ఈ రాహుల్ ఎవరు?

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు ప్రజల సోషల్ మీడియా ;పోస్టుల్లో ఎక్కువగా ఈ మధ్య కనబడిన, వినబడిన పేరు ఏదైనా ఉందంటే అది కెసిఆర్ ప్రెస్ మీట్ లో అయన నోటి నుండి పదే పదే వచ్చే రాహుల్ అనే పేరు. అసలు మ్యాటర్ తెలియనివాళ్ళకి రాహుల్ పోస్టులు చదివితే ఇష్క్ సినిమాలో నిత్యా మీనన్ జోక్ గుర్తుకు వస్తుంది. నీకు పిచ్చి పట్టిందా అనేది ఓల్డ్ స్టైల్ నీకు రాహుల్ పట్టాడా అనేది కొత్త స్టైల్ అంటూ నిత్య వేసే జోకులు ఫన్నీ గా ఉంటాయా. ఇపుడు సోషల్ మీడియా లో పొలిటికల్ పోస్టుల్లో కూడా ఇదే జోక్ వినబడుతుంది.

మామూలుగానే కెసిఆర్ ప్రెస్ మీట్లు అంటేనే బ్లాక్ బస్టర్ సినిమా టీవిలో మొదటి సారి వేసినప్పుడు ఉండేంత క్రేజ్ ఉండేది. ఈ కరోనా పుణ్యమా అని ఇపుడు ఫస్ట్ డే ఫస్ట్ షో క్రేజ్ ని మించిపోయింది. టీవీల టీఆర్పీ రేటింగులు పెంచేసాడు. యూట్యూబ్ ల్లో లైవ్ కౌంట్ గురించి తెలుగు ఛానల్స్ ని కొట్టుకునేలా చేసాడు. అది కెసిఆర్ మాటల తూటాలకు ఉన్న పవర్.

అయితే కెసిఆర్ ప్రెస్ మీట్ లలో కెసిఆర్ కె చిరాకు తెప్పించేలా ప్రశ్నించే ఒక రాహుల్ ఉన్నాడు. రాహుల్ అనగానే మన వాళ్లకు ఇరవైఏళ్ళ కుర్రాడే గుర్తొస్తారు ఊహకి. ఆ పేరు అలాంటిది మరి. కెసిఆర్ ని అయన అడిగే ప్రశ్నలు, కెసిఆర్ వాటికీ చిరాకు పడుతూ అయన స్టైల్ లో ఇచ్చే ఆన్సర్లు లేకుండా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఉండదు. అయితే ఇపుడు ఇది చర్చ కు దారి తీసింది.

ఇందులో రెండు చర్చలు ఉన్నాయి. ఒకటి ఇంతకీ ఈ రాహుల్ ఎవరు? రెండోది ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ బై టీఆర్ఎస్ అన్నది ?

ఇంతకీ ఈ రాహుల్ ఎవరు అని ఇపుడు సోషల్ మీడియా లో చర్చ షురూ అయింది. మొన్నటి వరకు కెసిఆర్ చెప్పే రాహుల్ అంటే ట్విట్టర్ లో రాహుల్ దేవులపల్లి అనే జర్నలిస్టు అని అందరు అనుకునే వాళ్ళు. తాను కూడా చివరికి నేను కాదు అని చెప్పేసాడు. కానీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ ని ఫస్ట్ పార్ట్ లో వదిలేసినట్టు అసలు రాహుల్ ఎవరో చెప్పకుండా వదిలేసాడు.

ఈ రాహుల్ దేవులపల్లి ఎవరో కాదు సీనియర్ జర్నలిస్టు అమర్ దేవులప్పల్లి కుమారుడు. ఈయన కూడా జర్నలిస్ట్. ది వీక్ అనే పత్రికకు పని చేస్తున్నాడు. మనోడు ట్విట్టర్ లో కాస్త జోరుగా ఉంటాడు.

అయితే ఇంతకీ అసలు రాహుల్ ఎవరు అని మీకు లాగే మేము కూడా వెతకడం స్టార్ట్ చేసాం. అప్పుడు తెలిసింది. కెసిఆర్ చెప్పే రాహుల్ ఈ రాహుల్ కాదని, ఆ రాహుల్ పేరు N.రాహుల్ అని, అయన కుర్రాడు కాదు సీనియర్ జర్నలిస్ట్ , ది హిందూ పత్రిక కోసం పని చేస్తారని తెల్సింది.

అయన ఫోటో మీకోసం :

ఈయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కెసిఆర్ తో పరిచయం ఎక్కువ, అందుకే కెసిఆర్ కూడా ఆయనతో అలా కొన్ని సార్లు సీరియస్ గా కొన్ని సార్లు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఈయన వార్తలు చదవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.

Read Previous

వలస కూలీలకు విజయవాడ పోలీసుల సేవ అద్భుతం

Read Next

కరోనా: కేటీఆర్ గారు గాంధీ హాస్పిటల్ లో నా భర్త మిస్సింగ్..