ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Friday, February 26, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
No Result
View All Result
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
English
No Result
View All Result
ADVERTISEMENT
Home తెలంగాణ

కెసిఆర్ కి హిందూ మతం పై ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఇది చదివితే తెలుస్తుంది

November 14, 2020
in తెలంగాణ, న్యూస్, భక్తి, రాజకీయం
కెసిఆర్ కి హిందూ మతం పై ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఇది చదివితే తెలుస్తుంది
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

తెలంగాణ రాష్ట్రంలో TRS vs BJP పోరు చాలా గట్టిగానే జరుగుతుంది. మొన్న 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ, నిన్న దుబ్బాక విజయంతో ఇక తెలంగాణాలో తెరాస కు పోటీ ఇచ్చే పార్టీ మాదే అంటూ ప్రచారంలోకి దిగడానికి వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే బండి సంజయ్ అధ్యక్షతన పెద్ద ఎత్తున భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుంది ఆ పార్టీ.

దుబ్బాకలో బీజేపీ గెలుపు కు కారణం రఘునందన్ రావ్ కు ఉన్న పలుకుబడి అని కొందరు అంటుంటే కాదు బండి సంజయ్ ప్రచారమే అంటున్నారు మరి కొందరు. ఇక వాళ్ళ పార్టీలో లొల్లి ఎలా ఉన్న ఇటు అధికార పార్టీ తెరాస మాత్రం తమ నేతల్లో తగ్గినా జోరును, పెరిగిన అవినీతిని ఎలా కట్టడి చేసి అటు రానున్న GHMC ఎన్నికల్లో , భవిష్యత్తు ఎన్నికల్లో గెలుపు దిశగా ఎటు వెళ్ళాలి అని ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది.

ఈ లొల్లి ఎప్పుడూ ఉండేదే. అయితే ఇపుడొచ్చిన కొత్త టాపిక్ మాత్రం డిఫరెంట్ ఓల్డ్ స్టోరీ. ఎన్నో ఏళ్లుగా బీజేపీ దక్షిణ భారత దేశంలో పాగా వేయడానికి, హిందూ మతం అడ్డు పెట్టుకొని ఓట్లు గెలవాలని ప్రయత్నించినా ఎందుకో కానీ అది కుదరలేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మనం వింటూ ఉన్నాము . కానీ ఈ మధ్య బీజేపీ ఆ విషయం దృష్ట్యా కాస్త గట్టిగానే ఫోకస్ చేసిందా అనేలా ఉన్నాయి ఆ పార్టీ కార్యాచరణలు, వారి నేతల మాటలు.

దుబ్బాక ప్రచారంలో కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ , ఆయనకు హిందువులంటే గౌరవం లేదని , నిజామ్ కు గులాం చేస్తాడు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. నిన్న కూడా ఈ కరోనా సమయంలో దీపావళికి టపాకాయలు కాల్చడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలంగాణ హైకోర్టు బ్యాన్ ప్రకటిస్తే దానికి కూడా కెసిఆర్ కారణం అంటూ అయన చేసిన ట్వీట్లు కాస్త హాస్యాస్పదంగా ఉన్నా కూడా అవి కావాలనే వాడుతున్న బాష అనేది బీజేపీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. సీఎం కేసీఆర్ నిజమైన, నిఖార్సయిన ఉద్యమకారులను పక్కన పెట్టి, ఎంఐఎం తో జతకట్టి.. హిందూ పండగలపై కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్నాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

అయితే 2019 ఎన్నికల సమయంలో కూడా ఈ టాపిక్ పై చర్చ జరిగినపుడు కెసిఆర్ చాలా ఘాటుగా స్పందించారు. నన్ను మించిన హిందూ మరొకరు లేరు అంటూ చెప్పుకొచ్చారు. నేను చేసినన్ని యాగాలు, పూజలు , హిందూ మతం పై ప్రేమ ఒలకపోసే బీజేపీ నేతలు కూడా ఎన్నడూ చేసి ఉండరు అంటూ కౌంటరు ఇచ్చారు.

ADVERTISEMENT

అయితే నిజంగా కెసిఆర్ కి హిందువులంటే కక్షనా , హిందూ మతం పై ప్రేమ లేదా, గౌరవం లేదా అనే వాదన ట్విట్టర్ లో షురూ అయింది. దీనికోసమే ఒక తెరాస అభిమాని చేసిన ట్వీట్లు ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆ ట్వీట్లు చదివితే ..అరె నిజమేగా అనిపించక తప్పదు. కెసిఆర్ కి హిందూ మతంపై కానీ హిందూ ఆచారాలపై కానీ నమ్మకం , విశ్వసం లేకపోతే అన్నన్నీ కోట్లు ఖర్చుపెట్టి యాగాలు చేయదు కదా? అన్ని గుడులు తిరిగడు కదా ? అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు !

ADVERTISEMENT

తెలంగాణ లో వివిధ ప్రాజెక్టులకు పెట్టిన హిందు దేవుళ్ళు దేవతల పేర్లు : ముందుగా ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్ట్ కి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని స్మరించుకుంటు కాళేశ్వరం గా నామకరణం. ఆ తరువాత మేడిగడ్డ ఆనకట్టకు లక్ష్మీ దేవి పేరుతో లక్ష్మీ బారాజ్, అన్నారం కి పార్వతీ దేవి, సుందిళ్ళ కి సరస్వతి బారాజ్ గా నామకరణం చేశారు. 25 టీఎంసీల కెపాసిటీ గల మానేరు డ్యామ్ కి వేములవాడ రాజ రాజేశ్వరి అమ్మవారి పేరు నంది గాయత్రి పంప్ హౌస్ లు కొండపోచమ్మ తల్లి పేరుతో 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ సాగర్ , కోమరవెల్లి మల్లన్నస్వామి పేరు మీద 50 టీఎంసీల సామర్ధ్యంతో మల్లన్న సాగర్ , 15 టీఎంసీల బస్వాపూర్ రిజర్వాయర్ కి నరసింహ స్వామి పేరు, దేవాదుల ఆనకట్టకు గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క పేరు, 90 టీఎంసీల ఎత్తిపోతల సామర్ధ్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, 37 టీఎంసీల సామర్ధ్యం గల దుమ్ముగూడెం ఆనకట్టకు సీతమ్మ తల్లి పేరుతో సీతమ్మ సాగర్, ఇలా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఆయా ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత దేవుళ్ళు దేవతల పేర్లు పెట్టుకొని స్మరించుకోడం జరుగుతుంది.

అంతే కాకుండ సుమారు 750 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం జరుగుతుంది. ఆలయం కోసం రెండు వేల ఎకరాల ప్రైవేటు భూమిని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఇవే కాకుండ అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటి ఐన జోగులంబ అమ్మవారి పేరుతో జోగులంబ గద్వాల జిల్లా ,దక్షిణ భారత అయోధ్య గా పేరుగాంచిన భద్రాచలం పేరుతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది . అంతే కాకుండ తెలంగాణ లో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరా పండగకి ఆడపడుచులు అందరికి చీరలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో అతి పెద్ద పండుగ ఐన బోనాలకు రాష్ట్రం మొత్తం సెలవు ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా బతుకమ్మ పండుగ జరుపుకోడానికి మొదటి రోజు సెలవు ఇవ్వడం దసరా తరువాత రోజు అదనపు సెలవు ఇస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏది ప్రారంభించిన చండీ యాగం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభింస్తారు.

ఒక్క హిందు మతమే కాదు అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ  రంజన్ కి పేద ముస్లింలకి దుస్తులు, క్రిస్టమస్ కి పేద క్రిస్టియన్ లకి దుస్తులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక చిన్న ఆలయాల ధూప దీప నైవేద్యాలకి నిధులు పూజరలుకి రాష్ట్ర ఖజానా నుండి జీతాలు ఇవ్వడం జరుగుతుంది .

తెలంగాణ లో వివిధ ప్రాజెక్టులకు పెట్టిన హిందు దేవుళ్ళు దేవతల పేర్లు ముందుగా ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్ట్ కి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని స్మరించుకుంటు కాళేశ్వరం గా నామకరణం ఆ తరువాత మేడిగడ్డ ఆనకట్టకు లక్ష్మీ దేవి పేరుతో లక్ష్మీ బారాజ్ అన్నారం కి పార్వతీ దేవి (1/10)

— Nizam_N.T.R (@Nizam_Ntr) November 14, 2020
Tags: kcr hindukcr hindu religionkcr hindutvaKCR true devout Hindu
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ:  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

‘పాగల్’ కూడా వచ్చేసాడు

‘పాగల్’ కూడా వచ్చేసాడు

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH