పవన్ ఎంట్రీ.. రేవంత్ కి చెక్: మాస్టర్ ప్లాన్ ఇదేనా

నల్లమలలో యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ రాజకీయ దిగ్గజం వి.హనుమంతరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలిసిన విషయం తెలిసిందే.

అయితే, యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు ఫైట్ చేస్తున్నారు. ఈమధ్య దూకుడు కూడా పెంచారు రేవంత్. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ పదవికి పోటీ నేపథ్యంలో ఒకరితరువాత ఒకరు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

వీహెచ్ కూడా దీనిని సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య వీహెచ్ కూడా దీనిని తీవ్రంగా కండించారు. ప్రస్తుత పవన్ భేటీ చూస్తుంటే వీహెచ్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లే తెలుస్తుంది. యురేనియం తవ్వకాల క్రెడిట్ రేవంత్ కి వెళ్లకుండా పవన్ ద్వారా దాన్ని డైవర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి వీహెచ్ కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ ను అడ్డుకొనే ప్రయత్నమే చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ పెద్దల వినికిడి.

ఐతే జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వరకు బిజీ అయింది. ప్రస్తుతం ఏపీ రాజధాని విషయంలో దూకుడు పెంచిన పవన్ ధీటైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తుతుల్లో జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.