తెలంగాణ పత్తికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవాలి
Timeline

తెలంగాణ పత్తికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవాలి

అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ వచ్చేలా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్‌పై ఆయన సూచనలు చేశారు.

రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.