BREAKING: ప్రైవేట్ ఆసుపత్రికి కరోనా అనుమతి రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Timeline

BREAKING: ప్రైవేట్ ఆసుపత్రికి కరోనా అనుమతి రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా వైరస్ నానాటికి వేగంగా పెరిగిపోతున్న వేళ ఈ భయంకర పరిస్థితిని సైతం సొమ్ము చేసుకునేందుకు ఆరాటపడుతున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సమాయత్తమవుతోంది. కరోనా బాధితుల నుంచి అమానుషంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ.లక్షల చొప్పున ఫీజు వసూలు చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు మరణించినా మిగతా రూ.లక్షల బిల్లును చెల్లించాల్సిందేనని, లేదంటే శవాన్ని అప్పగించేది లేదని బడా ఆస్పత్రులు నిబంధనలు విధించిన ఘటనలు వెలుగు చూశాయి. ఇక వీటి ఆటలు కట్టిపెట్టేందుకు కఠిన చర్యలకు వైద్యారోగ్య శాఖ సిద్దమయిపోయింది

ఈ నేపథ్యంలోనే ఈ రోజు డక్కన్ ఆసుపత్రికి కరోనా రోగులను చికిత్స చేసే అనుమతి రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. అంతే కాకుండా ఇకపై ఏ ఆసుపత్రి ఇలాంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published.