తెలంగాణాలో మరోసారి లాక్ డౌన్ రిక్వెస్ట్, కొట్టేసిన కోర్ట్
Timeline

తెలంగాణాలో మరోసారి లాక్ డౌన్ రిక్వెస్ట్, కొట్టేసిన కోర్ట్

తెలంగాణాలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. దేశంలో లాక్ డౌన్ విధించేకన్నా ముందే తెలంగాణలో లాక్ డౌన్ విధించినప్పటికీ….. కేసులు కంట్రోల్ కాకపోగా అవి అంతకంతకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ని ఎత్తివేసిన దగ్గరి నుండి రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. గాంధీ ఆసుపత్రి కూడా దాపుగా ఫుల్ అయినట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త, సునీత కృష్ణన్… తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. తెలంగాణాలో కేసులు ఎక్కువవుతున్నందున ప్రజల ఆరోగ్యం, ప్రాణాల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించాలని ఆమె హై కోర్టును కోరింది. లాక్ డౌన్ ని పొడిగించమని కోరడంతోపాటుగా పేదలకు 7,500 రూపాయలను ఇవ్వాలని ఆమె ఈ పిల్ లో కోరారు. కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దీనిపై విచారణ జరిపింది.

సునీత కృష్ణన్ వేసిన పిల్ ని కొట్టేసింది తెలంగాణ హై కోర్ట్. ప్రభుత్వాలు తీసుకునే పాలసీ నిర్ణయాలలో కోర్టు తలదూర్చదని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published.