ADVERTISEMENT
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నాడు హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది.ప్రభుత్వ వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.
సచివాలయ భవనాన్ని కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సహా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మరో 10 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు సుధీర్ఘంగా విచారణ జరిపింది. అన్ని వర్గాల వాదనలను హైకోర్టు వింది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించింది.
ADVERTISEMENT