తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పలు సూచనలు చేస్తూ అనుమతిచ్చింది.
రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్టాట్ బుకింగ్ చేసుకొనే విధానానికి అనుమతిచ్చింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు న్యాయస్థానం సమ్మతించింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది