కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు …
Timeline

కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు …

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు. కరోనాతో నాయిని ఆసుపత్రిలో చేరారని.. తీవ్రమైన లంగ్​ ఇన్​ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

కార్మిక రంగంలో నాయకునిగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి,కార్మికుల సమస్యల పట్ల నిత్యం పోరాడి, పలు కంపెనీల్లో యూనియన్లకు నాయకత్వం వహించిన ప్రజా నాయకుడు,కార్మిక నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నాయిని నర్సింహ రెడ్డి గారు.

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నాయిని నర్సింహా రెడ్డి గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని కెసిఆర్ తెలిపారు.