పట్టభద్రుల ఓట్లు నమోదు సందర్భంగా యూనియన్, సభ్యులతో పాటు గ్రాడ్యుయేట్స్ అందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన కార్యాలయం లో గ్రాడ్యుయేట్ లకు ఫారమ్-18 ను అందించి ఓట్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ADVERTISEMENT
ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు కీలకమైందని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కుని వినియోగించువాలని ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు భారీగా చేయించాలని సంఘ నేతలకు పిలుపునిచ్చారు ఆయన.
ADVERTISEMENT
ఈ కార్యక్రమం లో రాష్ట్ర సహాయ అధ్యక్షులు రాంగోపాల్ రెడ్డి, స్టేట్ కో- ఆర్డినేటర్ కాలసాని సంజయ్ రెడ్డి, స్టేట్ మీడియా వింగ్ ఇంచార్జ్ దండా రామకృష్ణ తో పాటు పలువురు గ్రాడ్యుయేట్ లు పాల్గొన్నారు.
ఓటరు నమోదుకు అర్హతలు
- దరఖాస్తుదారు సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నివసిస్తూ ఉండాలి.
- 2020 నవంబర్ 1 నాటికి కనీసం మూడేండ్ల ముందు విద్యార్హత సాధించి ఉండాలి.
- దరఖాస్తుకు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాలి. విద్యార్హతకు సంబంధించిన డిగ్రీ/ డిప్లొమా సర్టిఫికెట్/ మార్కుల జాబితా, లేక ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. వాటిపై డిజిగ్నేటెడ్ ఆఫీసర్/ గెజిటెడ్ ఆఫీసర్/ నోటరీ పబ్లిక్ అటెస్టెడ్ చేయించి జతచేయాలి.
- రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.ceotelangana.nic.in ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చు.
- గతంలో పట్టభద్రుల ఓటరుగా ఉన్నవారు సైతం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఓటర్ల జాబితా ఇప్పుడు పనికిరాదు.
- దరఖాస్తుల షెడ్యూల్ వివరాలు
- పెద్దమొత్తంలో వచ్చే దరఖాస్తులు, పోస్టు ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
- ఫామ్-18 ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు 2020 నవంబర్ 6 చివరి తేదీ.
- ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్ 1వ తేదీన ప్రచురిస్తారు.
- ైక్లెమ్‌లు, అభ్యంతరాల స్వీకరణను డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేపడతారు.
- కైమ్‌లు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే జనవరి 12లోగా పరిష్కరిస్తారు.
- ఓటర్ల తుదిజాబితాను జనవరి 18న ప్రచురిస్తారు.