Breaking News :

తెలంగాణ: ఈ రోజు 872 కరోనా కేసులు – జూన్ 22

 తెలంగాణలో కరోనా మహమ్మారి‌ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 872 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8674కి చేరింది.

ఈ రోజు మొత్తం 3,189 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఏడుగురు మృత్యువాత పడటంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 217కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే, ఈ రోజు మరో 274మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 4005కి పెరిగింది. 

తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు నమోదవడం గమనార్హం. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 107 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

జిల్లాల వారీగా కేసులు

Read Previous

కీన్ : గూగుల్ యొక్క సరికొత్త సర్వీస్

Read Next

H1-B వీసాలపై అమెరికా బ్యాన్