Breaking News :

బుల్లితెరపై బ్రహ్మాజీ… ప్రోమో అదిరింది

సంక్రాంతి పండుగకు అటు వెండి తెరపై సినిమాలతో పాటుగా బుల్లితెరపై కూడా సరికొత్త సినిమాలు అలాగే పలు రకాల ఈవెంట్స్ తో టాప్ మోస్ట్ చానల్స్ టాప్ లేచిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి సంసిద్ధం అవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే.అలా ఇప్పుడు స్టార్ మా ఛానెల్ వారు కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు “ప్రతిరోజూ పండగే” అనే ఒక స్పెషల్ ఈవెంట్ తో రాబోతుండగా ఇందులో స్టార్ మా పరివార్ లీగ్ లోని రెండు టీమ్స్ తో ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ కూడా కనిపిస్తున్నారు.

సినిమాల్లో మంచి కామెడీ టైమింగ్ కనబర్చిన బ్రహ్మాజీ ఇప్పుడు మరోసారి స్మాల్ స్క్రీన్ పై తనదైన టైమింగ్ తో ఆకట్టుకోబుతున్నారని స్టార్ మా వారు తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తే అర్ధం అవుతుంది.ఈ ఈవెంట్లో బిగ్ బాస్ రన్నర్ శ్రీముఖి కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ ఈవెంట్ జనవరి 12 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది.మరి ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

https://youtu.be/3PaTd0-g9NE

Read Previous

“RRR” అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Read Next

బ్రేకింగ్: జగన్ దెబ్బకు పువ్వు పట్టుకోనున్న జేసీ