నేటి రాశి ఫలితాలు (02-11-2020)
Timeline

నేటి రాశి ఫలితాలు (02-11-2020)

నేటి పంచాంగం:
వారం: సోమవారం
తిథి: విదియ రా.01:14
నక్షత్రము: కృత్తికా రా.11:50
వర్జ్యం: ఉ.10:23 నుంచి మ.12.11 వరకు
అమృత ఘడియలు: రా.08:18
శుభసమయం: ఉ.06:50- 07.15, సా.04:10- 04.35
దుర్ముహూర్తము: మ.12:14- 12.59, మ.02:31- 03.17
రాహు కాలం: ఉ.07:30 నుండి 09:00 వరకు
యమగండము: ఉ.10:30 నుండి మ.12:00 వరకు

మేషం

ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో శ్రమ ఒత్తిడి పెరిగిన కొత్త బాధ్యతలు వచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. ధన పరమైన సమస్యలనుండి బయటపడతారు. వ్యాపారమున కొత్త అవకాశములు లభిస్తాయి.

వృషభం

సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం సభ్యుల మధ్య మాటపట్టింపులు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలుంటాయి. సహోద్యోగుల సహాయం లభిస్తుంది.

మిధునం

కొత్త ఋణములు చెయ్యవలసిరావచ్చును. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు జాగ్రత్త వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగవచ్చు. వ్యాపారాలలో లాభాలు ఆశించిన మేరకు లభించవు. వృత్తి పరమైన వివాదాలుంటాయి.

కర్కాటకం

పనులు సకాలంలో పూర్తి చెయ్యడానికి అవకాశాలు వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో విహారయాత్ర సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

సింహం

బంధువులతో మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సమాజమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం పరంగా తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాలుంటాయి.

కన్య

కొత్త మార్గాలద్వారా ఆదాయం పెరుగుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలలో సఫలమౌతారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. జీవితభాగస్వామి నుంచి సహాయం లభిస్తుంది. వాహనయోగం ఉంది.

తుల

ఊహించని విధంగా అవకాశములు లభిస్తాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. మిత్రుల వలన దూర ప్రాంతమునుండి విలువైన సమాచారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు కలసివస్తాయి.

వృశ్చికం

గృహమున బంధువులు రావడం వలన ఆనందంగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్న అనుకొన్నవి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు

వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. పాత స్నేహితులతో విహారయాత్రలకు ప్రయాణాలుంటాయి. ఋణ సంబందమైన వ్యవహారాలలో బంధువుల నుంచి సాయం పొందుతారు. కొత్త వ్యాపారములు ప్రారంభించుటకు అనువైన రోజు. ఉద్యోగులకు పురోగతి ఉండును.

మకరం

చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం లభిస్తుంది. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరమైన అదనపు భాద్యతలు ఉంటాయి. కానీ సకాలంలో పూర్తిచేస్తారు. ధనదాయం బాగుండును.

కుంభం

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన ఒత్తిడి అధిగమించి పనులు పూర్తి చేస్తారు. ఆర్ధిక సమస్యలు తగ్గుతాయి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ పరంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

మీనం

కొన్ని ముఖ్యమైన వ్యవహారములు ఆలస్యముగా పూర్తవుతాయి. ఇతరులతో ఉన్న కలహాలు ఒక్కసారిగా రాజీ కుదురును. ఆకస్మిక ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.