కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి.. కన్నీళ్లు పెట్టించే కథ, గొప్ప వ్యక్తిత్వం మనోజ్ సొంతం

హైదరాబాద్ లో కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి చెందాడు. కరోనా సోకడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.

అతనికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా వైద్యులు చెబుతుండగా.. అతని మృతి పట్ల తోటి జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మనోజ్ విధులు TV5 న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అని సమాచారం

జర్నలిస్ట్ సర్కిల్స్ నుండి అందిన సమాచారం ప్రకారం మనోజ్ ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్దం అవుతుంది.

మనోజ్ కి 8 నెలల క్రితమే మ్యారేజ్ అయింది. యాక్సిడెంట్ లో మనోజ్ అక్క బావ చనిపోవడంతో వాళ్ళ బాబుని పెంచడం కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని ఆ బాబుకి తోడుగా ఉన్న ఈ సమయంలో కరోనా కాటేసింది.

మనోజ్ నీ ఆత్మ కు శాంతి కలగాలని, నీ ఆశయాలు చావకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం.

మనోజ్ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని, మనోజ్ పని చేస్తున్న సంస్ధ ఆర్ధికంగా ఆదుకంటుందని ఆశిస్తూ, అంతేకాకుండా ఇంత గొప్ప మనసున్న మనోజ్ వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని మనవి.