Breaking News :

తెలుగు360: నువ్వొక ఇడియట్

కరోనాపై పోరులో భాగంగా జగన్ ప్రభుత్వం ఈ వారం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన వార్త తెలిసిందే. ఈ కిట్ల ద్వారా హాట్ స్పాట్‌‌లలో కరోనా కేసులను అత్యంత త్వరగా గుర్తించే వీలుందట.

అయితే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు లేవనెత్తారు ప్రతిపక్షాలు. ఛత్తీస్‌గఢ్‌ ఒక్కో కిట్‌ను రూ. 337కు కొనుగోలు చేస్తే.. ఏపీ ఒక్కో కిట్‌కు రూ.1200 ఖర్చు చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. రెండు రాష్ట్రాలూ దక్షిణ కొరియా నుంచే కిట్లను పొందుతున్నాయని.. ఒక్కో కిట్‌కు భారీగా కమిషన్ కొట్టేశారని వారు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ మంత్రి ట్వీట్‌తో జగన్ బండారం బట్టబయలైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఒక్కో కిట్‌ను దాదాపు రూ.1200 చొప్పున ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసిందని వస్తున్నా వార్తల్లో ఎటువంటి వస్తావా లేదని తేల్చి చెప్పింది. సుమారు రూ.700కు ఈ కిట్లను పొందామని.. తుది ధర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించింది.

అయితే ఈ కిట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం వాటిని ఖండించి క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా దుష్ప్రచారం చేస్తున్న తెలుగు360 వెబ్సైటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అయినటువంటి ఎస్.రాజీవ్ కృష్ణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నువ్వొక ఇడియట్, ఇదే నీకు తగిన సమాధానం. తెలియకపోతే తెలుసుకో ఇలాంటి పరికరాలు ఎలా మార్కెట్ చేయబడుతాయో, వాటిలో ఉండే షరతులు ఆ తరువాత వాటి వళ్ళ వచ్చే ధరలో తేడాలు ఇలా చాల ఉంటాయి అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.

Read Previous

అక్రమ సంబంధం అనుమానంతో భార్య గొంతునులిమి హత్య చేసాడు

Read Next

ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తివేసే ప్రసక్తే లేదు