షార్ట్ న్యూస్: ఈరోజు ముఖ్యంశాలు – ఉదయం – నవంబర్ – 01 – తెలుగు వార్తలు
Timeline

షార్ట్ న్యూస్: ఈరోజు ముఖ్యంశాలు – ఉదయం – నవంబర్ – 01 – తెలుగు వార్తలు

ఏపీలో భారీ వాహనాల పన్ను చెల్లింపునకు మరో నెలరోజుల గడువు పెంపు.. గతంలో రిజిస్ట్రేషన్ అయిన చిన్న వాహనాలకు ఇక నుంచి క్వార్టర్లీ ట్యాక్స్, ఇక లైఫ్‌ట్యాక్స్ పరిధిలోకి 3 వేల కేజీలలోపు ఉండే చిన్న వాహనాలు

ప్రపంచవ్యాప్తంగా 4.63 కోట్లకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 11.99 లక్షల మంది కరోనాతో మృతి, 3.34 కోట్ల మంది రికవరీ

ఐపీఎల్‌: నేడు చెన్నైతో తలపడనున్న పంజాబ్.. అబుదాబి వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్

తెలంగాణలో గత 24 గంటల్లో 1,416 కొత్త పాజిటివ్ కేసులు నమోదు, 1,579 మంది రికవరీ, ఐదుగురు మృతి.. 2,40,048కి చేరిన పాజిటివ్‌ కేసులు, ఇప్పటి వరకు 2,20,466 మంది రికవరీ, 1341 మంది మృతి

ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. క్యాంప్‌ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్

సిద్దిపేట: బండి సంజయ్‌కి 18 ప్రశ్నలతో మంత్రి హరీష్‌రావు లేఖ.. నైతిక విలువలు మంట కలిపేలా బీజేపీ పనిచేస్తుంది, సీలేరుని ఏపీకి ఇచ్చింది ఎవరు?-మంత్రి హరీష్‌రావు

అమరావతి: ఏపీలో రేపటి నుంచి స్కూళ్ల రీ-ఓపెనింగ్.. విడతలవారీగా స్కూళ్ల రీ-ఓపెనింగ్‌ షెడ్యూల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం

బీహార్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ… బీహార్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-మోడీ