Breaking News :

ఇటలీ కరోనా కష్టాలు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

కరోనావైరస్ మహమ్మారి ఇటలీలో విజృంభిస్తోంది. రోగులందరికీ చికిత్స చేసేందుకు వసతులు చాలక… వారిలో ఎవరికి ప్రాణం పోయాలో, ఎవరిని వద్దనాలో తేల్చుకోలేక సతమతమవుతున్నామని అక్కడి వైద్య సిబ్బంది అంటున్నారు. ఇటలీలోని ఆసుపత్రుల్లో హృదయవిదారకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరోనా పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఏ బెడ్ మీద చూసినా కరోనా బాధితులే ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కనీసం గాలి కూడా అందడం లేదు. ఊపిరి తీసుకోవడం కూడా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంది. గాలి ఆడక బాధితులు నరకం చూస్తున్నారు. దీంతో వారికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి మరీ ఊపిరి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటలీ ఆసుపత్రుల్లో కరోనా బాధితులు పడే కష్టాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Previous

మహిళా పేషేంట్ కి.. ల్యాబ్‌ వైద్యుడి వేధింపులు.. చివరికి…

Read Next

జబర్దస్త్ ప్రోమో: బుల్లెట్ భాస్కర్ పై అప్పారావు సీరియస్.. అసలేం జరిగింది?