యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు.. తెలంగాణ ప్రభుత్వ పనితీరులోనే కొరత: కిషన్ రెడ్డి

రైతులు యూరియా కోసం రోజుల తరబడి, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి రావడం.. ఓ రైతు కూడా మృతిచెందడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం.. నిందను కేంద్రంపై నెట్టివేస్తోంది.

అయితే, దేశంలోని ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి… ఎరువుల పంపిణీ విషయంలో రాష్ట్ర సర్కార్.. తెలంగాణ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించిన ఆయన.. ఇప్పటికే 50 శాతం యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పంపించామని.. మరో 50 శాతం యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరులోనే కొరత ఉందని విమర్శించారు కిషన్ రెడ్డి.