న్యూ ట్రాఫిక్స్ రూల్స్: నీరుగారుస్తారా.. అనుసరిస్తారా రాష్ట్రాల ఇష్టం
Timeline

న్యూ ట్రాఫిక్స్ రూల్స్: నీరుగారుస్తారా.. అనుసరిస్తారా రాష్ట్రాల ఇష్టం

ఇకపై జరిగే రోడ్డు ప్రమాదాలకు రాష్ట్ర ప్రభుత్వమే జవాబుదారీ

ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు.. లక్షన్నర మంది మరణం

దేశంలో 30 % లైసెన్సులు నకిలీవి..

ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యం తప్ప.. ఆదాయ మార్గంగా భావించట్లేదు

ఎట్టకేలకు పెంచిన చలనాలపై కేంద్ర వెనకడుగు వేసింది. దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో కేంద్రం తన బెట్టు వీడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ ‘‘కొత్త మోటారు వాహన చట్టాన్ని అనుసరించడం లేక నీరుగార్చడం అన్నది రాష్ట్రాల ఇష్టం.

ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చు. కానీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ ప్రమాదాలను నివారించాలని ఉద్దేశ్యంతోనే మేము వాటిని అమలుచేస్తున్నాం తప్పితే డబ్బు కోసం మేము వాటిని తీసుకోని రాలేదు ‘‘ కేవలం ఆదాయ మార్గంగా భావించి ఈ భారీ జరిమానాలను విధించాలని మేమీ చట్టం రూపొందించలేదు.

ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో లక్షన్నర మంది చనిపోతున్నారు. అందులో యువతే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ చట్టాన్ని తీసుకొనివచ్చాము. దానిపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటికీ నేను ఒకటే చెపుతున్న ఇక పై జరిగే రోడ్డు ప్రమాదాలకు రాష్ట్ర ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి.

చలానాలకు తగ్గించటం, అమలుచేయకపోవటం అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. దేశంలో 30 % లైసెన్సులు నకిలీవి వున్నాయి, వాటిని ఏరిపారేయటానికి కూడా ఈ జరిమానాలు ఉపయోగపడ్డాయి , కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించటం దారుణమంటూ చెప్పుకొచ్చాడు. ఇక గుజరాత్ , పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇప్పటికే చలానాలను తగ్గించాయి. మున్ముందు చాలా రాష్ట్రాలు అదే బాటలో నడిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.