ట్రంప్ తెలివి, వైట్ హౌస్ లో తన చివరి రోజున చిన్న కూతురు నిశ్చితార్థం చేసేసాడు
Timeline

ట్రంప్ తెలివి, వైట్ హౌస్ లో తన చివరి రోజున చిన్న కూతురు నిశ్చితార్థం చేసేసాడు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్​కు చివరి రోజు అయిన నేడు ఆయన చిన్న కూతురు వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. 23ఏళ్ల వ్యాపారవేత్త మైకెల్​ బౌలోస్​ను ఆమె పెళ్లాడనున్నారు. ఈ మేరకు ఆమె తనకు కాబోయే భర్త మైఖేల్ బౌలోస్​తో కలసి వైట్​ హౌస్ లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. “శ్వేత సౌధంలో నా కుటుంబంతో గడిపిన క్షణాలు.. ఎన్నో జ్ఞాపకాలిచ్చాయని అయితే మైఖేల్‌తో నిశ్చితార్థం కంటే ప్రత్యేకమైనదేదీ లేదు” అని ఆమె తన ఇన్​స్టా ఖాతాలో రాసుకొచ్చారు. టిఫానీ-బౌలోస్​లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వైట్ హౌస్ అధికారిక కార్యక్రమాలకు సైతం ఇద్దరూ కలసి హాజరయ్యేవారు. ఇటీవలే జార్జ్‌టౌన్ లా స్కూల్ లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన 27ఏళ్ల టిఫానీ ట్రంప్.. డొనాల్డ్​ ట్రంప్​ రెండో భార్య మార్లా మాపుల్స్ కూతురు.

Image

Leave a Reply

Your email address will not be published.