వావ్.. మళ్లీ టిక్ టాక్ వచ్చేస్తుంది
Timeline

వావ్.. మళ్లీ టిక్ టాక్ వచ్చేస్తుంది

భారత్లో చైనా కంపెనీలకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్లు ఇండియన్ ప్రభుత్వం చేత బ్యాన్ కి గురయ్యాయి. ఇందులో ముఖ్యంగా టిక్ టాక్ మరియు పబ్జి లాంటి అప్లికేషన్లు చాలామంది యూజర్లకు బాధ కలిగించిన విషయం. అయితే ఇంగ్లీష్ పత్రికల కథనాల ప్రకారం టిక్ టాక్ మళ్లీ భారత్ ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం

భారత్ లో నిషేధానికి గురైన టిక్ టాక్ త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ ఉద్యోగులకు యాజమాన్యం రాసిన లేఖ ఈ మేరకు స్పష్టతనిస్తోంది.

డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేసేందుకు సంస్థ ఇప్పటికే సిద్ధమైందని లేఖలో పేర్కొంది.

అటు ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలపై తమ వివరణలను ఇప్పటికే సమర్పించామని వెల్లడించింది దేశంలో టిక్ టాక్ ఎదుగుదలకు చాలా అవకాశాలు ఉన్నాయని భరోసానిచ్చింది.

టిక్ టాక్ మాత్రమే కాదు పబ్ జి కూడా త్వరలో భారత్ లో రీఎంట్రీ ఇవ్వనుంది పబ్జి మొబైల్ ఇండియా పేరుతో అప్లికేషన్ ఉండబోతుంది అని సమాచారం