నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గ్యాంగ్‌లీడర్ చిత్రం టైటిల్ విషయంలో వివాదం ముదిరింది. టైటిల్ ప్రకటించిన సమయంలోనే పెద్ద గొడవ జరిగింది. దాన్ని సరి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి.గొడవ సర్దుమనిగిందని అంతా భావించారు. కాని సినిమా విడుదలకు వారం రోజుల ముందు మళ్లీ ఆ గొడవ రాజుకుంటుంది. వారితో మైత్రి మూవీస్ వారు సరిగా డీల్ చేయలేదని, దాంతో గ్యాంగ్‌లీడర్ టైటిల్ ఓనర్స్ ఛాంబర్లో ఫిర్యాదు నమోదు చేశారు.ఈ సమయంలో చేసేది లేక నాని అండ్ టీం గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను మార్చేశారు.
ఇలాంటి సందర్బాల్లో ఎక్కువగా టైటిల్‌కు ముందు హీరోల పేర్లను తలిగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చిత్రం విషయంలో కూడా అలాగే జరుగుతోంది. కాని ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే నాని అనే పదాన్ని చిన్నగా వేయకుండా గ్యాంగ్ లీడర్ స్థాయిలో వేయడం జరుగుతుంది.గ్యాంగ్ లీడర్ మాత్రమే కాకుండా ఇకపై ఈ చిత్రాన్ని నానిస్ గ్యాంగ్ లీడర్ అని పిలవాల్సి ఉంటుంది.
