Breaking News :

బ్రేకింగ్: ఈ సైట్స్ ని బ్యాన్ చేసిన టాలీవుడ్… అన్ అఫీషియల్

టాలీవుడ్ అంతా ఇప్పుడు ఒక్కటైంది. విజయ్ దేవరకొండ పెట్టిన ఒక్క వీడియో మహేష్ బాబు ని సైతం కదిలించింది. తెలుగు తారలపై ఫేక్ న్యూస్ వెబ్ సైట్లు , గాసిప్ వెబ్ సైట్లు వ్రాస్తున్న రాతలపై మండిపడుతున్నారు నటీ నటులు.

ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న కారణంతో తనపై , తాను చేస్తున్న సేవా కార్యక్రమాలపై అసత్య వార్తలు పెట్టారంటూ విజయ్ దేవరకొండ చేసిన ఆరోపణలు ఇపుడు టాలీవుడ్ పెద్దలను సైతం మాట్లాడేలా చేశాయి.

విజయ్ కి సపోర్ట్ గా మహేష్ , రానా, అనిల్ రావిపూడి, కొరటాల శివ , ఇపుడు చిరంజీవి నిలిచారు. వారి మద్దతుని తెలియజేసారు. అయితే ఈ విషయంపై సినీ పెద్దలు కూడా కాస్త ఆలోచిస్తున్నట్టు సమాచారం.

తెలుగు సర్కిల్స్ కి అందిన సమాచారం ప్రకారం తెలుగు ఫిలిం జర్నలిస్టులు , సినీ పెద్దలు కలిసి ఒక నిర్ణయానికి వాచినట్టు తెలుస్తుంది. కొన్ని టాప్ లో ఉన్న వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారనేది వార్త.

అందులో గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, గుల్తె, మిర్చి , ఇలా ఇంకా కొన్ని వెబ్ సైట్లు ఉన్నట్టు, ఇది కేవలం అన్ అఫీషియల్ బ్యాన్ మాత్రమే అని ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇకపై ఈ వెబ్ సైట్లకు సినిమా యాడ్స్ ఇవ్వకూడదని ఈ బ్యాన్ ఉద్దేశం.

ఇది అధికారికంగా నిర్మాతల మండలి కానీ, ఫిలిం జర్నలిస్టులు కానీ ప్రకటించే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది మరి కొద్దీ రోజులు ఆగితే కానీ తెలియదు.

ఒక్కటైన టాలీవుడ్, గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ కి మూర్తి రాజీనామా

Read Previous

ఒక్కటైన టాలీవుడ్, గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ కి మూర్తి రాజీనామా

Read Next

బిగ్ బ్రేకింగ్: కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ , రేపటి నుండి తెలంగాణలో వైన్ షాప్స్ ఓపెన్? రేట్లు పెరుగుతాయా?