టాలీవుడ్: ఫ్యాన్ వార్స్ కన్నా స్టార్ వార్స్ ఎక్కువ
Timeline

టాలీవుడ్: ఫ్యాన్ వార్స్ కన్నా స్టార్ వార్స్ ఎక్కువ

మాములుగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా, హీరో హీరోయిన్ల ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో గొడవలు అవ్వడం సహజం. ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరోని, వాళ్ళ ఫ్యాన్స్ ని లేదా ఒక హీరోయిన్ ఫ్యాన్స్ మరొక హీరోయిన్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతారు. అయితే ఇదేమి ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాదు. ఈ ఫ్యాన్ వార్స్ టాలీవుడ్ కన్నా బాలీవుడ్ , కోలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంటాయి.

టాలీవుడ్ లో ఎక్కువగా మెగా ఫ్యామిలీ Vs నందమూరి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. కోలీవుడ్ లో అజిత్ ఫ్యాన్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నంత ద్వేషం కనబడుతుంది.

అయితే ఈ ఫ్యాన్ వార్స్ ని ఏ హీరోలు ఎంకరేజ్ చేయరు. అటు కోలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా. ఇక హీరోలు కూడా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకున్న దాఖలాలు అతి తక్కువ. కానీ టాలీవుడ్ దీనికి బిన్నం. టాలీవుడ్ లో మొదటి నుండి ఫ్యాన్ వార్స్ కన్నా ఎక్కువగా స్టార్ వార్స్ జరుగుతుంటాయి. ఈ మధ్య అవి ఇంకా ఎక్కువ అయినట్టు కనిపిస్తున్నాయి.

మెగా స్టార్ చిరంజీవి కి మోహన్ బాబుకి మధ్య ఎప్పుడూ టామ్ & జెర్రీ వార్ నడిచేది. ఆ మధ్య ఒక వేదిక పైనే ఇద్దరు ఒకరినొకరు చాలా ఘాటుగా విమర్శించుకున్నారు. ఇందులోకి పవన్ కళ్యాణ్ కూడా తల పెట్టి ఇష్యూని ఇంకాస్త పెద్దది చేశాడు.

ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవికి జీవిత రాజ శేఖర్ కుటుంబానికి మధ్య పెద్ద గొడవలే జరిగాయి. రాజశేఖర్ పై చిరు అభిమానులు దాడి కూడా చేసారు అని వార్తల్లో వచ్చింది. ఆ వెంటనే చిరు వెళ్లి పరామర్శించారు.

ఇక లేటెస్ట్ గా తెరపైకి వచ్చిన పాత ఫైట్ బాలకృష్ణ Vs చిరంజీవి. ఇటు మెగా అభిమానులు అటు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇది చాలా కామన్ కూడా. అయితే విచిత్రం ఏంటంటే ఈ సారి ఏకంగా బాలకృష్ణ కి చిరు కి మధ్య డైరెక్ట్ వార్ జరుగుతుంది.

కరోనా కారణంగా ఇండస్ట్రీ మూతబడింది. దాని కోసం చిరు ఇండస్ట్రీ పెద్దలను తీసుకొని కెసిఆర్ దగ్గరకు చర్చలకు వెళ్లారు. ఆ చర్చలకు బాలయ్యను పిలవలేదని బాలయ్య బాబు కాస్త హడావిడి చేసి నోరు జారారు. దీనితో చిరు తమ్ముడు నాగబాబు బాలయ్యపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య ఉన్న వార్ కాస్త చిరు బాలయ్య మధ్య యుద్ధం లా మారింది. దీనితో ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా చీలబోతుంది అనేది ఇపుడు వినిపిస్తున్న మాట.

ఇక యంగ్ హీరోల మధ్య కూడా ఈ వార్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ vs విశ్వక్ సేన్ మధ్య కూడా సైలెంట్ వార్ నడుస్తుంది. విజయ్ అభిమానులు, విశ్వక్ అభిమానులు ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం, అంతే కాకుండా ఆ మధ్య విజయ్ పై విశ్వక్ చేసిన కామెంట్లు ఇవన్నీ వీళ్ళ మధ్య కోల్డ్ వార్ కి దారి తీసిన సంఘటనలు.

ఈ స్టార్ వార్స్ హీరోలతో ఆగిపోలేదు. దీనిలో హీరోయిన్ల పాత్ర కూడా మొదలైంది. ఇపుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ కూడా. హీరోయిన్ సమంత ప్రెట్టి గా లేదు అని హీరోయిన్ పూజ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. దీనితో సమంత ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టింది. సమంత స్నేహితురాలు అయిన చిన్మయి, డైరెక్టర్ నందిని రెడ్డి పూజ ను ఇండైరెక్టుగా ట్రోల్ చేస్తూ కామెంట్లు చేసారు.

దీనితో సమంత అభిమానులు, పూజ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేసుకోవడం మొదలు పెట్టారు.

ఇలా టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ కన్నా ఎక్కువగా స్టార్ వార్స్ జరుగుతున్నాయి అని సినిమా ప్రేక్షకులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published.