డ్రగ్స్ కేసు విచారణలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్, టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్జీబీ అధికారుల విచారణలో పాల్గొన్న టాలెంట్ మేనేజర్ జయ సాహా ఆమె పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరు బయటికి రావడం సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని జాతీయ న్యూస్ చానళ్లు నమ్రతా పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఎన్సీబీ విచారణలో నమ్రత పేరు బయటకు వచ్చినట్టు సమాచారం. ఎన్సీబీ ట్రాకింగ్‌లో జయా సాహా, నమ్రత చాటింగ్ వెలుగులోకి రావడంతో ఈ కేసులో నమ్రత పేరు బయటకు వచ్చింది. నమ్రతకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు జయా సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.

బాంబేలో మంచి ‘ఎండీ’ ఇస్తానని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత చాటింగ్‌ చేసినట్లు నేషనల్‌ మీడియా చెబుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జయ సాహాను విచారించారు. ఈ సందర్భంగా నమ్రతకు తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.