బ్రేకింగ్: హీరో రాజశేఖర్ డిశ్చార్జ్ మరో రెండు రోజుల్లో
Timeline

బ్రేకింగ్: హీరో రాజశేఖర్ డిశ్చార్జ్ మరో రెండు రోజుల్లో

గతకొద్దిరోజులుగా టాలీవుడ్ సినీ హీరో రాజశేఖర్ కరోనా కారణంగా హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ ఆయన కూతురు ట్విట్టర్లో తెలిపారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు.

అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని మరో రెండు మూడు రోజుల్లో రాజశేఖర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని జీవిత రాజశేఖర్ గురువారం తెలిపారు.ఆయనకు ప్లాస్మా అందించడంతో ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. కరోనా వైరస్‌ వల్ల శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్‌ తగ్గింది. పలు పరీక్షల అనంతరం ఆయనను ఐసీయూ నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నారని తెలిపింది.