వీడియో: పోలవరం వెళ్లిన హీరోయిన్ అనుష్క

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్‌ అనుష్క శెట్టి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పోలవరంలోని మహా నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలితో కలిసి అనుష్క పోలవరంలో సందడి చేశారు. అయితే ప్రజల కంట పడకుండా అనుష్క తెలివిగా వ్యవహరించారు. కరోనా మహమ్మారిని వల్ల ఏర్పడిన పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. పూర్తిగా మాస్క్ ధరించి, జనాలకు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకున్నారు. ఏకంగా స్నేహితులతో కలిసి అనుష్క గోదావరి నదిలో బోటులో షికారు చేశారు.

Image