టాలీవుడ్ @ సిరివెన్నెల ఇంట్లో పెళ్లి సంబురాలు
Timeline

టాలీవుడ్ @ సిరివెన్నెల ఇంట్లో పెళ్లి సంబురాలు

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు నటుడు రాజా ( రాజా భవాని శంకర శర్మ) ఓ ఇంటివాడయ్యారు. ఈయన వివాహం  వెంకటలక్ష్మి హిమబిందుతో  శనివారం ఉదయం హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో 10 గంటల 55 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇద్దరు కుమారుల సంతానం. పెద్ద కుమారుడు రాజా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో కుమారుడు యోగేశ్వర్ శర్మ సంగీత దర్శకుడిగా ప్రయత్నిస్తున్నారు. రాజా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ‘ఎవడు’, ‘ఫిదా’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘మిస్టర్ మజ్ను’, ‘రణరంగం’, ‘చాణక్య’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘భానుమతి & రామకృష్ణ’ వంటి సినిమాల్లో నటించారు. రాజా మంచి నటుడే అయినా ఇంకా సరైన గుర్తింపు ఆయనకు రాలేదు.