వీడియో వైర‌ల్: మ‌హేష్ ను ఎప్పుడు ఇలా చూసివుండరు !
Timeline

వీడియో వైర‌ల్: మ‌హేష్ ను ఎప్పుడు ఇలా చూసివుండరు !

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాటలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కరోనా లాక్ డౌన్ కాలం నుంచి మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉంటె సమయాల్లో మహేష్ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటారు. సితార, మహేష్, గౌతమ్‌ల అల్లరి, వారితో గడిపిన అందమైన క్షణాలను నమత్ర కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. కాగా తాజాగా, మహేష్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేశాడు. మహేష్ ఫిట్నెస్ పై పెడుతున్న శ్రద్ధను చూసి ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఎప్పటికప్పుడు సినిమాకి తగ్గట్లుగా శరీరాకృతిని మార్చుకోవాలన్నా.., ఆరోగ్యంగా ఉండాలన్నా.. జిమ్ చేయడం, యోగ చేయడం తప్పనిసరి ఈ విషయంలో మహేష్ కాస్త ముందుంటారనే చెప్పాలి.

Image

సర్కారు వారి పాట మూవీ కోసం మహేష్ కొత్త గెటప్ ట్రై చేయనున్నారు. దీని కోసం ఆయన జుట్టు పెంచారు. బ్యాంకింగ్ వ్యవస్థపై తెరకెక్కుతున్న సెటైరికల్ మూవీగా సర్కారు వారి పాట ఉంటుందని సమాచారం.

Image

వయసు పెరుగుతున్న కొద్దీ సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. యువకుడి తరహాలోనే స్మార్ట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తున్నాడు.

Image

టాలీవుడ్‌ ప్రముఖ టాప్ హీరోలల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే.

Image

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్స్‌లోనూ నటిస్తుంటారు. ఇప్పటికే పలు సక్సెస్‌ఫుల్ బ్రాండ్లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

Image

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణాది తారల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి స్టార్‌గా మహేష్ బాబు ఉన్నారు.ల్ మీడియాలో ఫాలోవర్స్ విపరీతంగా ఉన్నారు. దక్షిణాది తారల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి స్టార్‌గా మహేష్ బాబు ఉన్నారు.

Image

గత ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నారు.

Image

మహేష్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా నిర్మిస్తున్నాడు. మహేష్ కు అడవి శేష్ అంటే ప్రత్యేక అభిమానం. ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

Image


Image

మహేష్ ఖాళీ సమయాల్లో ఎక్కువగా కుటుంబానికే సమయం ఇస్తారు. సరదాగా టూర్లు వేయడం.. పిల్లలతో గడపడం.. ఇలాంటివాటికి మహేష్ ఎక్కువగా ఇష్టపడుతాడు.

Image

‘సర్కారు వారి పాట’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

Image

మహేష్ వర్కౌట్స్ చేస్తోన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published.