‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..
Timeline

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

టాలీవుడ్ సినిమాలు మరింత హిట్ పుట్టించడానికి సమ్మర్ కి రెడీ అయ్యాయి. ఒకదానివెంట ఒకటి క్యూ కట్టుకొని వస్తున్నాయి. గ్యాప్ లేకుండా వస్తుండటంతో కొన్ని సినిమాలు షూటింగులు కంప్లిట్ చేసుకున్న సమ్మర్ పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి దాకా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు తెరవాలన్న కేంద్రం తాజాగా ఆ నిబంధనను కూడా ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో బడా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వస్తున్న ‘చెక్’ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది.

వైష్ణవ్ తేజ్ నటించిన మూవీ ‘ఉప్పెన’ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 12న రాబోతోంది.

సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఎ వన్ ఎక్స్ ప్రెస్’ ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.

సమంత్ నటిస్తున్న ‘కపటధారి’ చిత్రం సైతం ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది. 

శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

దగ్గుబాటి రాణా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’సినిమా మార్చి 26 న విడుదల కానుంది.

నితిన్‌, కీర్తి సురేష్ ‘రంగ్‌ దే’ మార్చి 26న విడుదల కానుంది.

గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుంది.

Image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ను ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నారు. (అధికారికంగా వెల్లడి కావాల్సింది వుంది)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కానుంది.

రానా, సాయి పల్లవిల ‘విరాట పర్వం’ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా మే13న రానుంది.

విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ సినిమా మే 14న విడుదల చేయనున్నారు.

హీరో అడివిశేష్ ‘మేజర్’ సినిమా జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Image

హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘గని’ జులై 30న విడుదల చేయబోతున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ ల సినిమా ‘పుష్ప’ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగ్టస్ 13న రాబోతోంది.

Image

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రానుంది.

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది.

Image

Leave a Reply

Your email address will not be published.