మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న … తారక్
Timeline

మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న … తారక్

సెప్టెంబర్ 2 న దివంగత నటుడు నందమూరి హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా కన్నీటి పర్యంతం తో, భావోద్వేగ భరిత ట్వీట్ చేశారు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకొనే అశ్రుకణం మీరే అంటూ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు అని తెలిపారు. అంతేకాక 64 వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ మిస్ యూ నాన్న అని తెలిపారు.

అయితే నందమూరి హరికృష్ణ నటుడు గా , రాజకీయ నాయకుడి గా ప్రజల అందరి మన్ననలు పొందారు. హరికృష్ణ జయంతి సందర్భంగా పలువురు నేతలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం లో హరీకృష్ణ మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.