పవన్ కళ్యాణ్
Timeline

కొడాలి నానితో వకీల్ సాబ్ ప్రమోషన్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్

మంత్రి కొడాలి నానికి పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఈ సమస్యపై ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయాలని సూచించారు. కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన గుడివాడకు రాగానే కొడాలినానిపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి పాలిస్తే భరించరని తెలిపారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకూ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఒకవైపు కొడాలి నాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మీ […]

Read More
Timeline

మహేష్ తో పవన్ మాజీ భార్య…

ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో సినితరలంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. కొందరు ఇంటిపనులు చేస్తూ.. కొందరు ఛాలెంజ్ లు చేస్తూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రేణు దేశాయ్ కూడా ఇదే చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మహేష్‌, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా? […]

Read More
Timeline

2 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ ట్వీట్..

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఓ ఖాతా, సినిమాల గురించి మాట్లాడేందుకు మరో ఖాతా అంటూ, గతంలో చెప్పిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆపై ‘పీకే క్రియేటివ్ వర్క్స్’ పేరిట ఉన్న ఖాతాను 2018లో పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ అప్ డేట్స్, ‘ఖుషి’, ‘రంగస్థలం’ గురించి తమ అభిప్రాయాలను చెప్పిన తరువాత, ఆ ట్విట్టర్ ఖాతాను పవన్ ఉపయోగించలేదు. రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఇప్పుడు […]

Read More
Timeline

మహేష్ బాబు ని డైరెక్ట్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని

మెగాహీరో వరుణ్ తేజ్‌ కథానాయకుడిగా `గద్దలకొండ గణేష్` సినిమా రూపొందించి హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. హరీష్ తర్వాతి సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన హరీష్ ఆ వార్తల గురించి స్పందించాడు.  `పవన్‌కల్యాణ్ గారిని నేనెప్పడూ ఓ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడను. ఓ అభిమానిగానే చూస్తాను. […]

Read More
Timeline

హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ మళ్ళీ, హీరోగానా ? ప్రొడ్యూసర్ గానా ?

పవన్ వరస సినిమాలతో దుమ్ములేపుతున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే..మరోవైపు వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు క్రిష్‌తో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. మరోవైపు..పక్కా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో మూవీ కూడా తాజాగా కన్ఫామ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్‌తో తెలిపింది. గతంలో పవన్, హరీశ్ శంకర్ కలిసి ఇండస్ట్రీ హిట్ అయిన గబ్బర్ సింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతకు […]

Read More
Timeline

సెటైర్లు వేయడం ఆపేసి నిన్ను నువ్వు ప్రశ్నించుకో పవన్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. లక్ష్మీ నారాయణ గారి భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలుపుతూనే సెటైర్లు కూడా వేశారు. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, పాల ఫ్యాక్టరీలు వంటివి లేవని, తాను అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని అన్నారు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే అని, నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి కోసం, నా కుటుంబం […]

Read More
Timeline

బిగ్ స్టోరీ: సినిమాలు కాదు, పవన్ అలా చేయడం వల్లే జేడీ ఔట్

జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్‌కు, తనకు మధ్య అంతరం పెరుగుతుండడంతో ఆయన ఏ క్షణమైనా పార్టీని వీడొచ్చని అందరూ అంఛనా వేస్తున్న తరుణంలో ఊహాగానాలకు అనుగుణంగానే లక్ష్మినారాయణ జనసేన పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే… అందుకు ఆయన చూపిన కారణం మాత్రం వెరైటీగా వుంది. జనసేన పార్టీని వీడుతున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత ఎన్నికల్లో విశాఖ […]

Read More
Timeline

ఇంగ్లిష్ మీడియం వల్ల మత ప్రచారాలకు ఇబ్బంది అంటున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు మాధ్యమం విషయం లో పట్టు వదలడం లేదు. వైసీపీ నేతలు వ్యక్తిగతపరమైన విమర్శలు ఎన్ని చేస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఉండాలి అన్నట్లుగానే పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మనోవికాసానికైనా, మత ప్రచారానికైనా మనకు తెలిసిన భాషలో చెప్పినప్పుడే సామాన్యులకు సులభంగా అర్ధం అవుతుంది. అయితే ఇక్కడ పొందుపరిచిన వీడియోల్లో ఉన్న స్తోత్రాలు ఇంగ్లీష్ లో చెబితే శోభిల్లుతాయా? అంటూ పవన్ ప్రశ్నించారు. సామాన్యులకు అర్ధం అవుతాయా? […]

Read More
Timeline

పవన్ పింక్ రీమేక్ లో పూనమ్ కౌర్?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు విన్పిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లకు చాలా స‌మయం ఉండ‌టంతో ప‌వ‌న్‌ కళ్యాణ్ తప్పకుండా సినిమా ఫీల్డ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తార‌ని అంటున్నారు. ఇక ప‌వ‌న్‌ కళ్యాణ్ కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. కొన్ని నెల‌ల క్రితం సినిమాల‌కి దూర‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం పూర్తి రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ప‌లువురు నిర్మాత‌లు ఆయ‌న‌తో […]

Read More