ap politics
Timeline

కొడాలి నానితో వకీల్ సాబ్ ప్రమోషన్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్

మంత్రి కొడాలి నానికి పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఈ సమస్యపై ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయాలని సూచించారు. కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన గుడివాడకు రాగానే కొడాలినానిపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి పాలిస్తే భరించరని తెలిపారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకూ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఒకవైపు కొడాలి నాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మీ […]

Read More
Timeline

పవన్ కి పంగనామాలు… జగన్ కి జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి మరో సారి షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా పార్టీలో అంటీ ముట్టనట్టుగా ఉన్న రాపాక అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువగా తన మద్ధతు తెలుపుతున్నారు. అయితే సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశానికి రాపాక మద్ధతు తెలపబోతున్నట్టు ప్రకటించారు. అయితే నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానులపై ఓటింగ్ జరిగితే తాను కూడా మూడు రాజధానుల ప్రతిపాదనకే ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని […]

Read More
Timeline

లోకేష్ పై హోం మంత్రి ఆగ్రహం

పార్టీల ప్రమేయం లేకుండా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే, టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెంలో శుక్రవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గతేడాది గోవాళ్లపల్లి నాగమణి వ్యక్తిగత కారణాలతో ఉన్నవ శ్రీనివాసరావుపై ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆ కేసుపై సాక్షులతో విచారణ జరిగిందన్నారు. తీర్పు వెలువడే సమయంలో శ్రీనివాసరావు ఆత్మహత్యకు యత్నించారు. […]

Read More
Timeline

బీజేపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి, ఇది చంద్రబాబు వ్యూహమా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు, ముఖ్య, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో […]

Read More
Timeline

నిన్న దీదీ, రేపు బాబు – మోడీ తో దోస్తీ కట్టాల్సిందే

ధానమంత్రి నరేంద్ర మోదీని బెంగాల్‌కు ఆహ్వానించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రధానితో సమావేశమైన మమతా బెనర్జీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రధానిని మర్యాదపూర్వకంగానే తాను కలుసుకున్నానని, తమ సమావేశం ఫలప్రదమైందని చెప్పారు. బెంగాల్‌లో జరుగనున్న వాణిజ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్)కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించానని, అలాగే బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చే విషయంపై కూడా ఆయనతో మాట్లాడానని చెప్పారు. దీనిపై తాను చేయగలిగినదంతా చేస్తానని మోదీ హామీ ఇచ్చారని […]

Read More
Timeline

చిన్నారి లేఖ కి జగన్ రిప్లై

తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని చెబుతూ, తమకు అండగా ఉండాలంటూ ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామం నుంచి నాలుగో తరగతి విద్యార్థిని కోడూరి పుష్ప రాసిన లేఖపై సీయం జగన్‌మోహన్‌‌రెడ్డి స్పందించారు. చిన్నారి పాప తనకు లేఖ రాసిందని వచ్చిన వార్తల ఆధారంగా ముఖ్యమంత్రి వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి ఆరాతీశారు. వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు పూర్తిగా కనుక్కుని, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

Read More
Timeline

వీడియో : వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నాడు జగన్

ఏలూరు : న్యాయస్థానంలో చింతమనేనికి చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కేసులో చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు జిల్లా జైలుకు తరలించారు.

Read More