Coronavirus
Timeline

వ్యాక్సిన్ రాలేదు ..రాదు – బాలయ్య

కరోనా వ్యాక్సిన్‌పై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు… అసలు వ్యాక్సిన్‌ రాదు’  అని అన్నారు. విర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న ‘సెహరీ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఆయన సోమవారం లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా మన జీవితాంతం […]

Read More
Timeline

కరోనా: నెక్స్ట్ లెవల్ అతి ప్రమాదం – WHO

 ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంది’ అని హెచ్చరించింది. గురువారం-శుక్రవారం మధ్య 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్‌ టెడ్రెస్‌ అధనోమ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికం. వీటిలో సగానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు అధనోమ్‌ తెలిపారు. […]

Read More
Timeline

కరోనా: మంచిర్యాల నుండి ఆంధ్రా వెళ్లిన వ్యక్తికి పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా మహమ్మారి కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం కారణంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఈ మేరకు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుమొఖం పట్టిందని భావించేలోగానే, మళ్ళీ తెలంగాణ రాష్టంలో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కి […]

Read More
Timeline

దేశవ్యాప్తంగా రైళ్లు బంద్

లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే… వైరస్‌ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రైల్వే ప్రయాణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. పటిష్ట చర్యలు చేపట్టింది భారతీయ రైల్వే. అప్రాధాన్యమైన రూట్లలో, అధిక రద్దీ కలిగిన రూట్లలో ఇప్పటికే 155 రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేసింది. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఈ […]

Read More
Timeline

ఇంట్లోనే ఉండండి: విరుష్క

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. కొంద‌రు చేతుల‌ని ఎలా శుభ్ర‌ప‌ర‌చుకోవాలి. క్వారంటైన్‌గా ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. తాజాగా భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయ‌న భార్య అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు క‌లిసి సందేశాన్ని అందించారు. ఇంట్లోనే క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి. మ‌నం ఇంట్లో ఉంటే క‌రోనా వ్యాప్తి చెంద‌దు అని […]

Read More
Timeline

ఉగాది పంచాంగ శ్రవణానికి కరోనా గ్రహణం

శ్రీ శార్వరి తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ వేడుకలతో పాటు శ్రీరామ నవమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ప్రగతి భవన్ ఒక చోట నుంచే పంచాంగ శ్రవణం నిర్వహించి లైవ్‌లో ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి భవన్‌లో నిర్వహించే పంచాంగ శ్రవణానికి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించి పరిమిత సంఖ్యతో నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రగతి భవన్, రాజ్‌భవన్‌లో అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 24 వరకు […]

Read More
Timeline

మోదీ సూచనలను పాటిద్దాం: పవన్

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8 వేల మంది మరణించగా.. రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఇండియాలోనూ విజృభిస్తోంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ.. 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు వెలవడ్డాయి. కరోనా నివారణ కోసం ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 […]

Read More
Timeline

కరోనా వైరస్: భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేన్నైనా జయించగలమని గొప్పలు చెప్పుకొనే చైనా.. అమెరికా.. యూరప్‌ దేశాలు.. ఇప్పుడు ఒక మహాభూతానికి గడగడలాడుతున్నాయి. అనేక దేశాల్లో రోగం ఉన్నదని తేలేలోగానే మరణం సంభవిస్తున్నది. ఒకే ఒక్క దేశం.. 130 కోట్ల జనాభా.. భౌగోళికంగా విశాలం, సంక్లిష్టమైన భారతదేశం విజయవంతంగా వైరస్‌ను అడ్డుకొంటున్నది. ఇది ఎవరో అన్నమాటలు కావు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు. కరోనా నియంత్రణలో భారత్‌ నిబద్ధత అద్భుతమని కొనియాడింది. మన దేశంలో కరోనా […]

Read More
Timeline

కరోనా ఎఫెక్ట్: తీవ్ర ఆందోళనలో రాజమౌళి ట్వీట్

నోర‌ల్ క‌రోనా వైర‌స్ రోజురోజుకి విజృంభిస్తుండ‌డంతో ప్ర‌పంచం స్తంభించిపోతుంది. ఇప్ప‌టికే ప‌లు దేశాలలో జ‌నస‌మూహం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌ని మూసివేయాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సినిమా, టీవీ సీరియల్స్, డిజిటల్ షో షూటింగ్స్ ను ఆపేయాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నామని ఫిల్మ్ చాంబర్ వెల్లడించింది. మార్చి 31 వరకు అన్నీ షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. కోవిడ్ 19 […]

Read More
Timeline

కెనడా ప్రధాని భార్యకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవలే బ్రిటన్ పర్యటనకు వెళ్లి వచ్చిన త‌న భార్య‌కు కరోనా సోకింద‌న్న విషయాన్ని స్వయంగా ప్రధాని ట్రుడో ప్రకటించారు. త‌న భార్య‌కు ఫ్లూ ల‌క్ష‌ణాలుండ‌డంతో టెస్ట్‌లు చేయించాన‌ని.. త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలిందని ట్రుడో తెలిపారు. బ్రిట‌న్‌లో జ‌రిగిన‌ ఓ కార్యక్రమంలో ట్రుడో దంపతులు పాల్గొన్న అనంత‌రం సోఫీ గ్రెగోర్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెకు పరీక్షలు […]

Read More
Timeline

వీడియో: కరోనాపై ‘ఫైటర్’ యాడ్‌

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కారణంగా 3800 మందికి పైగా మరణించగా, ఒక్క చైనాలోనే కోవిడ్‌ మరణాల సంఖ్య 3136కి చేరుకుంది. ఇక కరోనా గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు లెక్కే లేదు. ఇక భాగ్యనగరంలో కరోనా అనుమానిత కేసులు నమోదవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా పేరు వినిపిస్తేనే కంగారుపడిపోతున్నారు. దీంతో వైరస్‌ గురించి భయాన్ని విడనాడి, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం […]

Read More