ktr
Timeline

కేటీఆర్.. ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

కేంద్రం ఏమిచ్చింది.. ఏమిచ్చింది.. అని అడుగుతున్నావ్.. భాగ్యనగరానికి నువ్వు కానీ, కార్పొరేటర్ కానీ చేసింది ఏంది..? నువ్వేమన్న సిరిసిల్ల నుంచి తెచ్చి ఇస్తున్నవా కేటీఆర్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. అభివృద్ధి అంటే కార్పొరేటర్లు కబ్జాలు చేయడమా అని ప్రశ్నించారు. మీ నాయనా చింతమడకకి లక్ష 50 వేలు ఇస్తే, కేంద్రం 8 లక్షలు ఇస్తుందన్నారు.  భాగ్యనగర్ లో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి డబ్బులు కేంద్రం ఇచ్చిందన్నారు. చర్యకి ప్రతి చర్య […]

Read More
Timeline

కవిత రీఎంట్రీ కన్ఫార్మ్.. రేపు నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ గా నామినేషన్

నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఓటమి తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటీ అనే ప్రశ్నలు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపించాయి. ఆమె రాజకీయాల నుంచి కొంతకాలం తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగానే జరిగింది. ఆమెకు రాజకీయాలు అంత ఆసక్తి లేదని, కొన్నాళ్ళు దూరంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని భావించారు. ఇక ఇదే సమయంలో ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు […]

Read More
Timeline

సక్సెస్ అయిన కేటీఆర్

తెలంగాణా మున్సిపల్ ఎన్నికలో తెరాస విపక్షాలకు చుక్కలు చూపించింది. తనను ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని భావించిన భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి కెసిఆర్ తన రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూపించారు. దాదాపు అన్ని మున్సిపాలిటీలు కూడా తెరాస పార్టీ భారీ అధిక్యాలతో విజయాలను నమోదు చేసుకుంది. మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా సత్తా చాటి౦ది. దీనితో ఇప్పుడు మంత్రి కేటిఆర్ పేరు మారు మోగిపోతుంది. మున్సిపల్ ఎన్నికల ముందు నుంచి కూడా ప్రత్యేక […]

Read More
Timeline

కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ను సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. డిసెంబర్‌ లో నిర్వహించనున్న అంతర్జాతీయ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు సహకారం అదించాలని ఈ సందర్భంగా కెటిఆర్‌ ను కపిల్‌ కోరారు. కెటిఆర్‌ స్పందిస్తూ, ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. దీంతోపాటు పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు.

Read More
Timeline

షీ టీమ్స్: శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

‘షీ టీమ్స్’ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్బంగా తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో ‘షీ టీమ్స్’ విజయవంతమైన దృష్ట్యా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సేవలు విస్తరిస్తామని అన్నారు. ఐదేళ్ల కాలంలో 33,700 కేసులను ‘షీ టీమ్స్’ పరిష్కరించగల్గిందని చెప్పారు. మహిళల హక్కులకు, స్వేచ్ఛకు సంబంధించి వారిని చైతన్య పరచడంతో ‘షీ టీమ్స్’ ప్రధాన పాత్ర పోషిస్తుందని కేటీఆర్ ప్రశంసించారు.

Read More
Timeline

రామగుండం ఎరువుల కర్మాగారం: అన్నివిధాలా సహకరిస్తాం

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, కార్యకలాపాల ప్రారంభం కోసం అన్నివిధాలా సహకరిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. కంపెనీ పునరుద్ధరణ పనులపై మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, రామగుండం ఎమ్మెల్యే చందర్, పరిశ్రమల శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. కంపెనీ పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న కేటీఆర్​… అన్నివిధాలా సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు కంపెనీ పునరుద్దరణకు కృషి చేశామన్న మంత్రి… […]

Read More
Timeline

కేటీఆర్ ఓ బచ్చా

హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌దే విజయమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. తండ్రి ఇచ్చిన మంత్రి పదవితో విర్రవీగుతున్నారే తప్ప అతనికి ఏం తెలియదన్నట్లుగా చురకలు అంటించారు. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్‌దే విజయమని ధీమాతో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను ఎందుకు కొంటున్నారని ధ్వజమెత్తారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఛాన్స్ లేదని తేల్చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజుర్‌నగర్ […]

Read More
Timeline

అందుకే.. ఐటీలో నెంబర్ వన్

తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలిసేందుకే పొరుగు రాష్ట్రాల్లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేవనెత్తిన అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఐదు సంవత్సరాల్లోనే అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు బీమా పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలేగాక, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ […]

Read More
Timeline

తలసాని కొడుక్కి ఫైన్ వెయ్యరా సార్?

ఆ గోడలపై పోస్టర్లు చూస్తే కాకా పట్టడానికే ఈ ప్రయత్నం అని ఇట్టే అర్దమైపోద్ది తెరాస లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ సిటీ గోడలను పోస్టర్లతో నింపేసి గబ్బు గబ్బు చేసేసాడు. దానికి కారణం ఏంటంటే, కొత్తగా కెసిఆర్ క్యాబినెట్ లోకి మంత్రి పదవితో తిరిగి అరంగేట్రం చేసిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అభినందించడానికే. సాయి కిరణ్ యాదవ్ మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కొట్టేసి […]

Read More
Timeline

మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ కామెంట్.. ఆ దిశగా ప్రయత్నాలు

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత నుండి ఇటీవలే తెలంగాణ మంత్రి గా పదవీ బాధ్యతలను స్వీకరించినటువంటి కేటీఆర్ ఇకమీదట తెలంగాణాలో పార్టీ ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అధికారికంగా హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే 60 లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఇకపోతే తెలంగాణాలో త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడిన మంత్రి కేటీఆర్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కష్టపడతామని కేటీఆర్ అన్నారు. దానికితోడు […]

Read More
Timeline

కేటీఆర్‌కు మద్దతు తెలిపిన ప్రభాస్‌

వైరల్ జ్వరాలు, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది దోమల నివారణకు, పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. మీ ఇంటి పరిసరాలను పరిశీలించండి, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోండి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, ఇతర నీరు నిలిచే వస్తువులను తనీఖీ చేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేటీఆర్ తన సొంత ఇంటి […]

Read More
Timeline

తెలంగాణ మంత్రులు, శాఖలు వివరాలు

1.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి, జిఎడి, శాంతి భద్రతలు, రెవెన్యూ, ఇరిగేషన్ సీఎం వద్దనే. 2. మహమూద్ అలీ: హోంమంత్రి. 3.ఇంద్రకరణ్ రెడ్డి : అటవీ, పర్యావరణం, శాస్త్ర – సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖలు 4.తలసాని శ్రీనివాస యాదవ్ : పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు 5.గుంటకండ్ల జగదీశ్ రెడ్డి : విద్యుత్ శాఖ 6.ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు 7.సింగిరెడ్డి నిరంజన్ […]

Read More
Timeline

కెసిఆర్ కొత్త మంత్రులు వీళ్ళేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త మంత్రులకు సంబంధించిన పేర్లను కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అలాగే, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కేసీఆర్ ఆదేశించారు. గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందించిన జాబితాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ […]

Read More