Breaking News :

అలర్ట్: బెల్లంపల్లిలో ఐదుకి చేరిన కరోనా కేసులు

బెల్లంపల్లి సింగరేణి కార్మికునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో కలకలం రేగింది. కార్మికులు, అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. సదరు కార్మికుల కొడుకు పూణే నుంచి 2 నెలల క్రితం బెల్లంపల్లి వచ్చి ఈనెల 1 తిరిగి వెళ్ళాడు. పాజిటివ్ వచ్చిన కార్మికులు కన్నాల బస్తీ, కన్నాలతోపాటు గోదావరిఖనిలో జరిగిన వివాహ వేడుకలకు హాజరైనట్లు పలువురు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో ఐసో లేషన్లో చేరగా ఆదివారం పాజిటివ్గా ప్రకటించారు. కార్మికుడు ఎక్కడికి వెళ్ళా డు, ఎవరిని కలిశాడనే కోణంలో అధికారులు వివరాలు సేకరించి వారి నమూనాలు టెస్టుకు పంపించారు.

ఇందులో ఆ కార్మికుడు భార్య కి మరియు తనతో పని చేసే సహా ఉద్యోగులు ముగ్గురికి ఈరోజు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

నిన్న 32 మంది నమూనాలు టెస్టుకు పంపగా అందులో ఈరోజు నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఇప్పటివరకు బెల్లంపల్లిలో మొత్తం ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి

Read Previous

చైతన్యతో మెగా ప్రిన్స్ నిహారిక పెళ్లి ఫిక్స్?

Read Next

స్పెషల్: నిహారిక చేసుకోబోయే అబ్బాయి ఫోటోలు