Breaking News :

దేశవ్యాప్తంగా రైళ్లు బంద్

లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే… వైరస్‌ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రైల్వే ప్రయాణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. పటిష్ట చర్యలు చేపట్టింది భారతీయ రైల్వే. అప్రాధాన్యమైన రూట్లలో, అధిక రద్దీ కలిగిన రూట్లలో ఇప్పటికే 155 రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేసింది.

మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఈ క్రమంలో జనతా కర్ఫ్యూలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఏ ప్యాసింజర్ రైలు బయలుదేరబోదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

Read Previous

రెండో పెళ్ళి చేసుకున్న అమలాపాల్‌

Read Next

సమాజం ఆమోదించని సంబంధాలలోనే అనుభూతి ఎక్కువగా ఉంటుందా?