తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత నుండి ఇటీవలే తెలంగాణ మంత్రి గా పదవీ బాధ్యతలను స్వీకరించినటువంటి కేటీఆర్ ఇకమీదట తెలంగాణాలో పార్టీ ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అధికారికంగా హామీ ఇచ్చారు.
కాగా ఇప్పటికే 60 లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఇకపోతే తెలంగాణాలో త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడిన మంత్రి కేటీఆర్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కష్టపడతామని కేటీఆర్ అన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT
దానికితోడు జిల్లాల వారీగా పార్టీకి సంబందించిన కమిటీలు ఏర్పాటు చేసి మరీ చర్చలు జరుపుతామని కేటీఆర్ వెల్లడించారు. కాగా పార్టీ సంస్థాగత బలంతో టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిలోకి తీసుకెళ్ళేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని కేటీఆర్ తెలిపారు.