టీఅర్ఎస్ ముఖ్య నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.
అయితే ఈ నెల 7 వ తేదినుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీకి హాజరు కాబోయే నేతలకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో హరీష్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది.
ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తనను ఈమధ్య కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని హరీష్ రావు సూచించారు. అయితే అయన అసెంబ్లీ కి హాజరు అవుతారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.