బిగ్ బ్రేకింగ్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు, అశ్వత్థామరెడ్డి పై తిరగ బడుతున్న కార్మికులు

1297

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 22రోజులుగా చేస్తున్న సమ్మెలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఓ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. కూకట్ పల్లి డిపోకు చెందిన డ్రైవర్ రాజు తన ఫిర్యాదులో అనేక విషయాలు పేర్కొన్నాడు.

డ్రైవర్ రాజు రాసిన లేఖలో సారాంశం ఈవిధంగా ఉంది.. అశ్వత్తామరెడ్డి విలీనం అనే విషాన్ని కార్మికుల్లో నింపారని, దీంతో సమ్మెలో ఉన్న పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపాడు. వీరి ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డే ప్రధాన కారకుడు. ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే అశ్వత్థామరెడ్డి పై ఫిర్యాదు చేశాను.

ఒకప్పుడు ఆర్టీసీకి పెద్దన్నలా వ్యవహరించిన హరీష్‌ రావును కొందరు పనికిమాలిన వాళ్లు ‘ మీరు మౌనంగా ఉండొద్దు, నోరు విప్పాలి అంటూ’ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు సమ్మె విషయం హరీష్‌ రావుతో చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు.

ఇప్పుడు చేస్తున్న సమ్మె వల్ల పోలీసుల సహాయం లేకుండా బస్సులు రోడ్డు మీదకు వెళ్లడం లేదు. మా చేతులతో మేమే ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నాం.

గురువారం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమ్మె మాట పక్కనబెట్టి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా మనకు గొప్ప అవకాశం. మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దు. అశ్వత్థామరెడ్డి మీరు ప్రధాని, రాష్ట్రపతి వద్దకు వెళ్లి మా సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ మా కార్మికుల పొట్ట గొట్టద్దు’ అని ఆ ఫిర్యాదులో వెల్లడించాడు.