Breaking News :

TSRTC: జూన్ నెల పూర్తి వేతనం

tsrtc employees to get full salary

కరోనా కారణంగా ఆర్థిక భారంతో కుస్తీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాల కోతలు విధించిన విషయం తెలిసిందే. సగం జీతాలు మాత్రమే ఇస్తూ నెట్టుకొస్తున్నాయి సంస్థలు. ఇందులో భాగంగానే TSRTC కూడా గత 3 నెలలుగా సగం జీతాలు మాత్రమే ఇచ్చింది. దీనితో ఉద్యోగులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి , యాజమాన్యం నుండి ఒక తీపి కబురు వచ్చింది.

మార్చి నుంచి సగం వేతనాలు అందుకుంటున్న వారికి జూన్ నెల కోత లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియడం.. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది.

దీనితో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల పూర్తి వేతనాలు చెల్లించడంతో.. ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సంస్థలో పని చేస్తున్న 49,733 మంది సిబ్బంది జీతాలకు గానూ సుమారు రూ. 160 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిపై అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Read Previous

కరోనా అలర్ట్: హైదరాబాద్ – ఆదిలాబాద్ బస్సులో

Read Next

EXCLUSIVE: అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ కన్ఫార్మ్