Breaking News :

ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి అరెస్ట్

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. సుందరయ్య పార్కు వద్ద నిరసనలో పాల్గంటున్న టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో పాటు ఆర్టీసీ నేతలు రాజిరెడ్డి, వెంకన్నలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్ర సర్కారు తన మొండి వైఖరిని వీడాలని అశ్వత్థామరెడ్డి అన్నారు.

తాము తలపెట్టిన సమ్మెను కొనసాగించి, దీన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు డిపోల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ రోజు బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. రేపు ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి బంద్‌ కు మద్దతు వచ్చింది. బంద్‌ ను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Read Previous

ఐటీ దాడులు: అజ్ఞాతంలో కల్కిభగవాన్‌ దంపతులు

Read Next

కెసిఆర్ – జగన్ దోస్తీకి బ్రేక్?