Breaking News :

టీఎస్ఆర్టీసీ స్ట్రైక్ @ 5వ రోజు

హైదరాబాద్‌: ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. ఆందోళనను మరింత ఉద్ధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్న ఐకాస.. పోరాటంతో ఉద్యోగ, ప్రజా సంఘాలను భాగస్వాములను చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఐకాస నేతలు నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా, వివిధ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈనెల 5 నుంచి కార్మికులు సమ్మెబాట పట్టారు. అయితే సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో కార్మిక సంఘాలు భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. డిపోల ముందు బతుకమ్మ ఆడటం.. సెమి పూజలు చేయడం ద్వారా ఇప్పటికే నిరసన వ్యక్తం చేసిన కార్మికులు పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇవాళ ఆర్టీసీ ఐకాస కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానించినట్లు ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఈ భేటీకి అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కూడా హాజరుకావాలని ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు.

Read Previous

@peacefulllsoul : అందుకే రావణ దహనం

Read Next

కళ్యాణ్ రామ్ : చాలా మంచోడు