చర్చలు చర్చలే.. సమ్మె సమ్మెనే..

హైకోర్టు తీర్పు అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి స్పందించారు. యాజమాన్యమైనా, ప్రభుత్వమైన చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తామని తెలిపారు. హైకోర్టు కూడా అదే తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. 3 రోజుల క్రితం తమతో చర్చలు జరపాలని.. కోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని అశ్వత్థామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి సమ్మె 14 రోజులైనా ప్రభుత్వం స్పందిచట్లేదన్నారు. తాము చర్చలకు సిద్ధమేనని .. తమ 26 డిమాండ్లు చర్చకు రావల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పటివరకు ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కొత్త వార్తలు