సుప్రీం కోర్టు చేరనున్న ఆర్టీసీ లొల్లి

28

రేపు (సోమవారం) హై కోర్ట్ లో తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. టీఎస్ఆర్టీసీ ప్రభుత్వం తో విలీనం విషయం లో ఆర్టీసీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం చిలికి చిలికి గాలివాన అయ్యి అది కాస్తా పెద్ద తుఫానుగా మారింది. హైకోర్టు ఏ తీర్పు లోనైనా కెసిఆర్ ప్రభుత్వానిదే తప్పుగా చెప్పుకొస్తుంది. ప్రతిసారి ప్రభుత్వానిదే తప్పుడు లెక్కలని కోర్టు చెబుతోందని.. చివరకు ఐఏఎస్ అధికారులు హాజరై వివరణ ఇచ్చినా పాజిటివ్ సమాధానం రావట్లేదన్న వేదనను కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

గత నేల (అక్టోబర్) 5 వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు రోజుకో విధంగా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. నిన్న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేసిన సంగతీ తెలిసిందే. ఈ విధంగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పటికే 37వ రోజుకు చేరుకుంది. అయితే హైకోర్టులో తమకు ఎదురుదెబ్బ తగిలినా వెనక్కి తగ్గకూడదని సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించి.. ఈ అంశాన్ని లెక్క తేల్చాల్సిందేనని కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఆర్టీసీ ఎపిసోడ్ లో విలన్ గా మారిన సీఎం కెసిఆర్ కి చాలా డ్యామేజ్ జరిగింది . అయినా వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ ఆర్టీసీ పంచాయితిని ఢిల్లీ లో తేల్చుకోవాలనుకోవడం విశేషం.