ఆర్టీసీ సమ్మె ఆగదు … అశ్వథామ రెడ్డి

12

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు దాదాపు 50 రోజులుగా పైగా సమ్మెను చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా ఈ కేసును హైకోర్ట్ లేబర్ కోర్ట్‌కి పంపడంతో కార్మికులు సమ్మెను విరమించేందుకు సిద్దమయ్యారు. అయితే ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధులలో చేర్చుకోవాలని అప్పుడే తాము తిరిగి విధులలో చేరుతామని అన్నారు. అయితే దీనిపై మాత్రం ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, కార్మిక సంఘాలను చర్చలకు కూడా పిలవకపోవడంతో సమ్మెను యధావిధిగా కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ డిసైడ్ అయ్యింది.

అయితే నేడు ఈయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని, ఆర్టీసీ భవిష్యత్‌పై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. సమ్మె కొనసాగింపులో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు మానవ హారాలు నిర్వహిస్తామని, ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతారని ప్రకటించారు. అయితే ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని, ఉద్యోగాలపై ఆర్టీసీ కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.