ఆ టైటిల్ మార్చాలి.. ఏబీఎన్, టీవీ5లపై నిషేధం సరికాదు

12

వాల్మీకి పేరుతో వస్తున్న సినిమా వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నా యని, అందువల్ల ఆ సినిమా పేరును మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొందరి మనోభావాలు దెబ్బతినేలా ఉన్న వాల్మీకి చిత్రం పేరు వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏబీఎన్, టీవీ5లపై నిషేధం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం లేకుండా ఎవరి పాత్ర వారు పోషించాలని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ.