Breaking News :

మీడియా: TV5 ఆ వీడియోలు ఎందుకు డిలీట్ చేసింది?

కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో… మెడ్‌టెక్ జోన్‌ పేరు తెలుగు రాష్ట్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మెడ్‌టెక్ జోన్ క్రెడిట్‌ను ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

ఈ ప్రాజెక్ట్ బాబు సీఎంగా ఉన్న సమయంలో ఏర్పాటైంది కాబట్టి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఘనత కూడా తమదేనని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. మెడ్‌టైక్ జోన్‌లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు హయాంలోనే TV5 బయట పెట్టింది. కానీ ఇపుడు ఆ వీడియోలు మాయమైపోయాయి.

కానీ ఈ ఇంటర్నెట్ ఇన్వెస్టిగేటర్ల ముందు జర్నలిస్టులెంత? మొత్తానికి ఆ వీడియోలను బయటపెట్టేసారు. తిరిగి ట్విట్టర్ అకౌంట్లలో అప్లోడ్ చేసేసారు. మేమే బయటపెట్టాం అని గంటలు గంటలు కథనాలు ప్రచురించిన ఛానల్ ఒక్కసారిగా ఆ వీడియోలు డిలీట్ చేయడం, అంతే కాకుండా మెడ్ టెక్ జోన్ క్రెడిట్ చంద్రబాబు కి ఇవ్వడం ఇవన్నీ చాలవా యెల్లో మీడియా రంగులు బయటపెట్టడానికి అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు 2016 ఆగష్టు నెలలో శంకుస్థాపన చేశారు. ఈ జోన్‌ను ఏర్పాటు చేయడం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమీపంలో 270 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. 2018 చివర్లో మెడ్‌టెక్ జోన్‌ను నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విదేశాల నుంచి వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. దీంతో వైద్య పరికరాలను తక్కువ ఖర్చుతో మన దేశంలోనే ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కేంద్రం చొరవతో ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. జితేందర్ శర్మ ఏపీ మెడ్‌టెక్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

ఇదే మెడ్ టెక్ జోన్ ను చంద్రబాబు హయాం లో ఉన్నపుడు ఎప్పుడూ ప్రచారం చేయలేదు. ఎందుకంటె ఈ జోన్ ఏర్పడింది కేంద్రం కృషితో, అందుకే బాబు ఎన్నడూ దీనిని ప్రచారం చేయలేదు కానీ ఇపుడు సడెన్ గా జగన్ ఇక్కడ కిట్ల తయారీ చేపట్టే పనులు మొదలెట్టే సరికి క్రెడిట్ కోసం ముందు లైన్లో నిలబడ్డారు బాబు బ్యాచ్ అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇంతకీ అపుడు ఎవరిని టార్గెట్ చేస్తూ TV5 ఈ స్కాం ని బయటపెట్టిందో, ఇపుడు ఎవరిని సేవ్ చేయడం కోసం ఆ వీడియోలు డిలీట్ చేసిందో అనేది పెద్ద మిస్టరీగా మారిపోయింది.

Read Previous

బ్రేకింగ్: హైదరాబాద్ లో ఈ 12 ప్రాంతాలు రెడ్ జోన్ గా ప్రకటన

Read Next

తెలంగాణాలో కరోనా కేసులు తగ్గాయా?